ఆలోచనకు ప్రేరణ..ఆవిష్కరణకు ఆలంబన!
ఇన్‌స్పైర్‌తో జాతీయ గుర్తింపు
విద్యార్థులకు సదావకాశం
ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు: 1089
దరఖాస్తుకు అర్హులైన విద్యార్థులు: 2,15,876
అవకాశం వచ్చేది: 4,533
‘ఊహలకు హద్దులు లేవు. దార్శనికతలో మీరు భాగస్వాములవ్వాలి. నా ఆలోచనలకు రూపమిచ్చే స్థాయిలో విద్యార్థులు ఉన్నారు. రాయలసీమలో కరవును తరిమేందుకు ఓ ప్రయోగం చేసి నీరందించి సఫలం అయ్యాం. చిన్నప్పటి నుంచే ప్రాంతానికి అనువైన ఆవిష్కరణలకు రూపమిస్తే ప్రోత్సహించడానికి నేనున్నా. మీ ప్రయోగాలు సఫలం కాకపోయినా ఆందోళన వద్దు.’
- ముఖ్యమంత్రి చంద్రబాబు
‘చాలామంది చాలా ఆలోచనలు చేస్తారు. కొందరు మధ్యలోనే వదిలేస్తారు. మరికొందరు అంతరాల్లోకి వెళ్లి అంతు చూస్తారు. విజేతలుగా నిలుస్తారు. పదేళ్ల వయసులో మొలకెత్తిన ఆశయం.. నెరవేరే వరకు ప్రోత్సాహకాలు అందిస్తాం. చిన్న ఆలోచనతో ఆవిష్కరణలు చేసిన ఎందరో భారతీయులు ఆయా కంపెనీలకు అధిపతులుగా ఉన్నారు. వినూత్న ఆవిష్కరణలతో భారతావనిని ముందుకు తీసుకెళ్లాలి. భరతమాతకు 250 కోట్ల చేతులున్నాయి. అందులో 200 కోట్ల చేతులు 35 ఏళ్లలోపు వయసు యువతవే.’
- ప్రధానమంత్రి మోదీ
చిన్నారులూ ఇదో గొప్ప అవకాశం.. భారత శాస్త్రసాంకేతిక విభాగం మీకు అండగా నిలుస్తోంది. ఇన్‌స్పైర్ అవార్డులతో ప్రోత్సహిస్తోంది.. ఆలోచన మీదైతే చాలు.. ఆవిష్కరణకు ప్రభుత్వం తోడ్పాటు ఇస్తోంది. ఒక్క పైసా ఖర్చు లేకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెస్తోంది. తరగతి గదిలో ఉపాధ్యాయుడు చెప్పే పాఠ్యాంశాన్నే నిజ జీవితానికి అనువదించుకుని.. నీ ప్రాంతానికి, భారతావనికి అవసరమైన ఆవిష్కరణలు చేసి మీరే శాస్త్రవేత్త కావచ్చు. ఆలోచనల మార్పిడితో సరికొత్త అద్భుతాలు సృష్టించొచ్చు. విద్యార్థులు చేయాల్సిందల్లా ఆలోచనలను పంపడమే.. ఎలా పంపాలి.. ఎవరెవరు అర్హులు.. ప్రయోజనం ఏమిటి.. జాతీయ స్థాయిలో కీర్తి ఎలా వస్తుందో తెలుసుకుందాం..
- న్యూస్‌టుడే, అనంతపురం విద్య
ఇదీ పథకం ఉద్దేశం
చిన్నారుల్లో దాగిఉన్న సైన్సు జిజ్ఞాసను వెలికి తీయడానికి భారత ప్రభుత్వం ప్రేరణ పురస్కారం అందిస్తోంది. ఇన్‌స్పైర్-మనక్ ద్వారా పదిలక్షల మంది విద్యార్థులకు పురస్కారాలు అందివ్వడానికి ముందుకు వచ్చింది. విద్యార్థుల్లో సైన్సు పట్ల ఆసక్తి రగిలించి, ఆయా ప్రాంతాలకు అవసరమైన ఆవిష్కరణలు అందివ్వాలన్నదే దీని ఉద్దేశం.
ఇవిగో ముఖ్యాంశాలు
దరఖాస్తుకు చివరి తేదీ: 31.7.2018
బాధ్యులు ఎవరు: ప్రధానోపాధ్యాయులు, సైన్సు టీచర్లు
ప్రయోజనం: విద్యార్థులను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దడం
ఏం చేయాలంటే: ఉపాధ్యాయులు www.inspireawards-dst.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లి పాఠశాల అథారిటీలో మొదట రిజిస్ట్రేషన్ (రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే అవసరం లేదు) చేసుకోవాలి. వెంటనే యూజర్ ఐడీ, పాస్‌వర్డు చరవాణికి అందుతుంది. అందులో విద్యార్థుల వివరాలు, ప్రాజెక్టు వివరాలు కనీసం మూడు వందల పదాలకు మించకుండా బాక్స్‌లో పొందుపరచాలి. గైడు టీచరు, బ్యాంకు వివరాలు, ప్రాజెక్టుకు వివరాలు పేపర్లో రాసి, రెండు మెగాబైట్లు మించకుండా స్కాన్ చేసి పంపాల్సి ఉంటుంది.
స్పందిస్తే.. రూ.4.53 కోట్లు
6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఇన్‌స్పైర్ పురస్కారానికి అర్హులు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు ఇన్‌స్పైర్‌లో పాల్గొనవచ్చు. ప్రతి ప్రాథమికోన్నత పాఠశాల నుంచి ముగ్గురు, ఉన్నత పాఠశాల నుంచి ఐదుగురుకి మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఈలెక్కన 4,533 మందికి రూ.10 వేల చొప్పున మొత్తం రూ.4.53 కోట్లు నేరుగా వారి ఖాతాల్లోకి జమ అవుతుంది.
అనంతకు అవార్డులు ఇలా..
సంవత్సరం అవార్డులు
2011 278
2012 901
2013 508
2014 910
2015 837
2016 833
2017 420
డిజిటల్.. స్వచ్ఛతకు ప్రాధాన్యం
ఈ ఏడాది భారత శాస్త్ర, సాంకేతిక విభాగం కొన్ని అంశాలను ప్రతిపాదించి వాటికి ప్రేరణ అవార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. డిజిటల్ ఇండియా, మేక్‌ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛభారత్, క్లీన్ ఇండియాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇవే కాకుండా సృజనాత్మకం, సమాజ అవసరానికి అనువైన అంశాలకు అవకాశం కల్పించారు. గ్రీన్ ఎనర్జీ, పర్యావరణం, సైన్స్, ఆరోగ్యం, సహజ వనరులపై ఆలోచనలు పంచుకోవచ్చు.
ప్రేరణ అవార్డులు ఇలా..
అవార్డుకు ఎంపికైన విద్యార్థుల ఖాతాలో ముందుగానే రూ.10 వేలు జమ చేస్తారు. సైన్సు ఉపాధ్యాయుల సహకారంతో నమూనాను సిద్ధం చేసి జిల్లా స్థాయిలో ప్రదర్శించాలి. ఉత్తమ ప్రాజెక్టుగా ఎంపికైన వారిని రాష్ట్ర స్థాయికి పంపుతారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైతే.. జాతీయ స్థాయి ప్రదర్శనలో అవకాశం కల్పిస్తారు. ఇందులో ఐఐటీ, ఎన్‌ఐటీ, ఐఐఎస్‌ఈఆర్ సంస్థల ఆధ్వర్యంలో ఉత్తమ ప్రాజెక్టులను ఎంపిక చేస్తారు. కేవలం 60 ప్రాజెక్టులను రాష్ట్రపతి భవన్‌లో ప్రదర్శించే అవకాశం కల్పిస్తారు. ఆ ఆలోచనలకు ప్రభుత్వమే పేటెంట్ హక్కులు కల్పిస్తుంది.
మెరిసిన చిన్నోడు
అనంత చిన్నోడు జాతీయ స్థాయిలో మెరిశాడు. తన గ్రామంలోని సమస్యనే అస్త్రంగా తీసుకుని నమూనా సిద్ధం చేశాడు. ఈ నమూనా జాతీయ స్థాయిలో మెరిసింది. ఉరవకొండ మండలం రాకెట్ల జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలకు చెందిన మహేష్ ప్రస్తుతం పదోతరగతి చదువుచున్నాడు. గైడ్ టీచరు గంగాభవాని సహకారంతో ‘ప్లాస్టోన్’ ప్రాజెక్టును రూపొందించాడు. వృథాగా పారేసే ప్లాస్టిక్, ఇతరత్రా వ్యర్థాలతో పర్యావరణం కాలుష్యం అవుతున్నట్లు గుర్తించాడు. ఇటుకలు తయారు చేయడానికి చెట్లను నరికి వేయడం చూశాడు. దీంతో విద్యార్థి 15 వృథా బాటిళ్లు, 100 ప్లాస్టిక్ గ్లాసులు, గ్రానైట్ వృథా రాళ్లను మిళితం చేసి, సాధారణ ఇటుక కంటే ఐదురెట్లు పటిష్టంగా ఉంటుందని ప్రాజెక్టుకు రూపకల్పన చేశాడు. ఈ నమూనా జాతీయ స్థాయికి ఎంపికైంది.
ప్రతి ఆలోచన ఆవిష్కరణ అవ్వాలి
చిన్నారుల్లో ఉన్న ప్రతి ఆలోచన ఆవిష్కరణ అవ్వాలి. ప్రతి పాఠశాలలోని ఉపాధ్యాయులు వారి నామినేషన్లు పంపాలి. ప్రతి అవార్డుకు రూ.10 వేలు వస్తుంది. విద్యార్థుల్లో దాగి ఉన్న శాస్త్ర, సాంకేతిక ఆలోచనలు బయటకు తీయడానికి ఇది మంచి పరిణామం. అందరూ నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయాలి.
- జనార్దనాచార్యులు, జిల్లా విద్యాశాఖాధికారి

Comentarios: